మద్యం మాల్స్‌ వచ్చేశాయ్‌!

ABN , First Publish Date - 2021-02-06T08:42:39+05:30 IST

మాల్స్‌.. సూపర్‌ మార్కెట్ల వలెనే.. మద్యం మాల్స్‌ కూడా వచ్చేశాయ్‌. ఈ మాల్స్‌లోకి వెళ్లి.. మనకు నచ్చిన సరుకును మనమే తీసుకుని, బిల్లు చేయించుకోవచ్చు.

మద్యం మాల్స్‌ వచ్చేశాయ్‌!

మాల్స్‌.. సూపర్‌ మార్కెట్ల వలెనే.. మద్యం మాల్స్‌ కూడా వచ్చేశాయ్‌. ఈ మాల్స్‌లోకి వెళ్లి.. మనకు నచ్చిన సరుకును మనమే తీసుకుని, బిల్లు చేయించుకోవచ్చు. మహానగరాలకే పరిమితమైన ఇలాంటి మద్యం మాల్స్‌ ఇప్పుడు నెల్లూరులో కూడా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వమే ఈ మాల్స్‌ నిర్వహిస్తోంది. ఉదయం 11  నుంచి రాత్రి 8 గంటల వరకు మాల్స్‌ నడుస్తాయి. నెల్లూరులో నాలుగు స్టోర్స్‌ ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఇక్కడ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ స్టోర్స్‌లో చీప్‌ బ్రాండ్‌లకు చోటు ఉండదు. ఖరీదైన మద్యం మాత్రమే లభిస్తుంది.

- నెల్లూరు క్రైం

Updated Date - 2021-02-06T08:42:39+05:30 IST