నా భర్త ఎక్కడున్నాడో తెలియదు... కస్టడీ విచారణలో అఖిలప్రియ

ABN , First Publish Date - 2021-01-12T22:42:54+05:30 IST

బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకు రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీలు అఖిలప్రియను ప్రశ్నించారు. కిడ్నాపర్లతో...

నా భర్త ఎక్కడున్నాడో తెలియదు... కస్టడీ విచారణలో అఖిలప్రియ

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకు రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీలు అఖిలప్రియను ప్రశ్నించారు. కిడ్నాపర్లతో భూమా అఖిల ప్రియ మాట్లాడిన కాల్స్‌పై విచారణ జరిపారు. తాను రాజకీయ నాయకురాలినని చాలా మంది కాల్స్ చేస్తుంటారని, అందులో భాగంగానే గుంటూరు శ్రీనుతో మాట్లాడినట్లు అఖిలప్రియ పోలీసులకు తెలిపారు. భర్త భార్గవ్‌రామ్ ఆచూకీ‌పై కూడా పోలీసులు ప్రశ్నించారు. తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదని అఖిలప్రియ చెప్పారు. ఇక టవర్ లోకేషన్, సిమ్ కార్డ్ నంబర్స్‌ను కూడా అఖిలప్రియ ముందుంచి ప్రశ్నించారు. తనకేమీ తెలియదంటూ పోలీసులకు అఖిలప్రియ సమాధానమిచ్చారు. తమకు ప్రవీణ్ రావు కుటుంబసభ్యులకు మధ్య భూ వివాదం ఉందని పోలీసులకు అఖిలప్రియ తెలిపారు. 

Updated Date - 2021-01-12T22:42:54+05:30 IST