బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చింది : ఆదిమూలపు సురేష్

ABN , First Publish Date - 2021-11-02T21:36:14+05:30 IST

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పందించారు.

బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చింది : ఆదిమూలపు సురేష్

అమరావతి : వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పందించారు. టీడీపీ లోపాయికారి ఒప్పందంతో ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. గతంలో వచ్చిన మెజారిటీకి మించి ఇప్పుడు ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే దీనికి కారణమని సురేష్ పేర్కొన్నారు.


Updated Date - 2021-11-02T21:36:14+05:30 IST