భూముల ఆక్రమణపై చర్యలు: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-06-14T20:25:13+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ 2020..21 సంవత్సరానికి బుణప్రణాళికను రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల సమావేశంలో విడుదల చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు.

భూముల ఆక్రమణపై చర్యలు: మంత్రి కన్నబాబు

అమరావతి: 2020-21 సంవత్సరానికి రుణప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు. సోమవారం మీడియాతో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కొవిడ్ కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా బ్యాంకర్లు సహకరించారని సీఎం సమావేశంలో తెలిపారన్నారు. వ్యవసాయ, విద్య, వైద్యరంగాలకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జగనన్న కాలనీల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి సహకరించాలని సీఎం బ్యాంకర్లను కోరారని చెప్పారు. కౌలురైతులకు సంబంధించి అత్యధికంగా రుణాలు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీసీఆర్సీ కార్డుల ఆవశ్యకతపై భూ యజమానులకు నష్టం లేకుండా ఓ క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎమ్మెస్సెమ్మికి సంబంధించి రీస్టార్ట్, నవోదయ లాంటి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలన్నారు. బ్యాంకర్లుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్తున్న మద్దతు ఎంతో బావుందని మంత్రి కన్నబాబు తెలిపారు.


ఆ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: మంత్రి కన్నబాబు 

విశాఖలో సంవత్సరాల తరబడి ఆక్రమణలు చేస్తూ పోతే ఆ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కూడా అక్కడి భూ అక్రమణలపై సిట్ వేసిందన్నారు. తమ ద‌ృష్టికి వచ్చిన భూముల ఆక్రమణపై చర్యలు చేపట్టామన్నారు. ఆక్రమణలో ఉన్న భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటే అది కక్షసాధింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజల భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-14T20:25:13+05:30 IST