ఏపీని గంజాయి కేంద్రంగా మార్చారు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-10-22T01:17:03+05:30 IST

టీడీపీని అణచివేయాలని రెండేళ్లుగా తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని గంజాయి కేంద్రంగా మార్చారు: అచ్చెన్నాయుడు

అమరావతి: టీడీపీని అణచివేయాలని రెండేళ్లుగా తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీ ఆఫీసులపై దాడులు జరగలేదన్నారు. ఏపీని గంజాయి కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారని చెప్పారు. ఇది ప్రభుత్వం, పోలీసులు కలిసి చేసిన దాడేనన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరామన్నారు. 


Updated Date - 2021-10-22T01:17:03+05:30 IST