వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2021-06-22T08:36:15+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో సోమవారం ఆరుగురిని విచారించారు

వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం

కడప (క్రైం), జూన్‌ 21 : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో సోమవారం ఆరుగురిని విచారించారు. వైఎస్‌ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని ఏడుగంటల పాటు విచారించారు. అలాగే కడపకు చెందిన ఉపాధ్యాయుడు రవిశంకర్‌, పులివెందులకు చెందిన క్రిష్ణయ్య, సావిత్రి దంపతులు,   వారి కుమారులు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ఏడు గంటల పాటు ప్రశ్నించి వారి నుంచి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కడపకు చెందిన ఉపాధ్యాయుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ మహిళను విచారించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-22T08:36:15+05:30 IST