ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి

ABN , First Publish Date - 2021-05-19T03:33:11+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. మీడియాను

ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి

హైదరాబాద్/ అమరావతి : ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. మీడియాను ఏపీ సర్కార్ భయపెడుతోందని ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రతివాదులుగా సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌ను చేర్చింది. ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ సర్కార్ అమలు చేయడం లేదని, ఏపీ ప్రభుత్వం మీడియాను భయపెట్టే చర్యలు తీసుకుంటోందని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి తెలిపింది. కరోనా సంబంధిత వార్తలను అడ్డుకోరాదని ఏప్రిల్ 30 న సుప్రీం ఇచ్చిన తీర్పును ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఈ సందర్భంగా గుర్తు చేసింది. నరసాపురం ఎంపీ రఘురామ కరోనాపై మాట్లాడిన అంశాలను ప్రసారం చేసినందుకు గాను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టిన విషయం విదితమే. 

Updated Date - 2021-05-19T03:33:11+05:30 IST