ప్రభుత్వ నేరారోపణపై ఏబీ వెంకటేశ్వరావు సమాధానం

ABN , First Publish Date - 2021-01-13T02:39:10+05:30 IST

తనపై ప్రభుత్వం చేసిన నేరారోపణకు ఏబీ వెంకటేశ్వరావు సమాధానం ఇచ్చారు. సమాధానానికి 30 రోజులు గడువు.. కానీ ఇచ్చింది 15 రోజులేనని..

ప్రభుత్వ నేరారోపణపై ఏబీ వెంకటేశ్వరావు సమాధానం

అమరావతి: తనపై ప్రభుత్వం చేసిన నేరారోపణకు ఏబీ వెంకటేశ్వరావు సమాధానం ఇచ్చారు. సమాధానానికి 30 రోజులు గడువు ఇచ్చారని.. కానీ ఇచ్చింది మాత్రం 15 రోజులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేరారోపణ పత్రాలు కూడా ప్రభుత్వం తనకు ఇవ్వలేదన్నారు. ఒక్క రూపాయి నష్టం జరగని కొనుగోళ్లలో తానెలా దోషినౌతానని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సీపీఆర్వో శ్రీహరితో 7 పేజీల ఆరోపణల నోట్‌తో ప్రచారం చేయించారన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద తనకు నమ్మకం లేదని ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరావు తెలిపారు. 


Updated Date - 2021-01-13T02:39:10+05:30 IST