మా బిడ్డను కాపాడండి

ABN , First Publish Date - 2021-12-30T08:33:31+05:30 IST

ఆటపాటలతో గడపాల్సిన బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేక, మృత్యు ముఖానికి చేరువవుతున్న చిన్నారిని బతికించుకునే మార్గం లేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా బిడ్డను కాపాడండి

  • క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడు
  • ఆదుకోవాలంటూ తల్లిదండ్రుల విజ్ఞప్తి

కొండాపురం, డిసెంబరు 29: ఆటపాటలతో గడపాల్సిన బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేక, మృత్యు ముఖానికి చేరువవుతున్న చిన్నారిని బతికించుకునే మార్గం లేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా కొండాపురానికి చెందిన సంపంగి చిన్నసుబ్బరాయుడు, సుజాతల ఏకైక కుమారుడు రెడ్డెప్ప(8) కొంతకాలంగా క్యాన్సర్‌తో మంచానపడ్డాడు. కూలిపని చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు ఇప్పటికే  పలు ఆసుపత్రుల్లో చిన్నారికి వైద్యం చేయించినా ఫలితం లేదు. న్యూరోబ్లాస్తమా అనే క్యాన్సర్‌తో రెడ్డెప్ప బాధపడుతున్నాడని హైదరాబాద్‌ ఎంఎన్‌జే వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు సుమారు రూ.20లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ వ్యాధి 4వ దశలో ఉందని మరో ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ దంపతులు బిడ్డకు వైద్యం చేయించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. రెడ్డప్ప చికిత్స కోసం దాతలు కొండాపురం స్టేట్‌బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ 32886585211 (ఐఎ్‌ఫఎ్‌ససీ: ఎస్‌బీఐఎన్‌ 0002746)కు గాని, 810673 9383కు ఫోన్‌పే ద్వారా కానీ సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-12-30T08:33:31+05:30 IST