ఏపీలో కొత్తగా 96 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-02-26T21:19:51+05:30 IST

డిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 96 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి

ఏపీలో కొత్తగా 96 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 96 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,89,681కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,169 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 635 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,81,877 మంది రికవరీ అయ్యారు. కరోనాతో కొత్తగా చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. 


మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 189 కరోనా కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,98,453కి చేరింది. 1632 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 1910 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా చికిత్స నుంచి కోలుకుని 2,94,911 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా 1910 యక్టీవ్ కేసులలో 818 మంది ఐసోలాషన్‌లో ఉన్నారు.

Updated Date - 2021-02-26T21:19:51+05:30 IST