9 మంది విద్యార్థులకు కరోనా

ABN , First Publish Date - 2021-08-27T09:12:28+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గురువారం 9మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది.

9 మంది   విద్యార్థులకు కరోనా

పాఠశాలల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

కడప జిల్లాలో కొవిడ్‌తో ఏఎన్‌ఎం మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గురువారం 9మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాలో ఐదుగురికి, తూర్పు గోదావరిలో ముగ్గురికి, విశాఖలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రెండు పాఠశాలల్లో మూడు రోజుల కిందట విద్యార్థులకు పరీక్షలు చేశారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో ఐదుగురుకి పాజిటివ్‌ వచ్చిందని కొండవెలగాడ పీహెచ్‌సీ వైద్యురాలు గాయిత్రీదేవి ధ్రువీకరించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంవడ్లమూరు ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 3, 4 తరగతుల విద్యార్థుల్లో ఇద్దరికి, కాలేరు ఉన్నత పాఠశాలలో టెన్త్‌ విద్యార్ధినికి వైరస్‌ సోకింది. విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం పేటసూదిపురం మండల పరిషత్‌ ప్రాఽథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి విద్యార్థినికి పాజిటివ్‌  వచ్చింది. 

Updated Date - 2021-08-27T09:12:28+05:30 IST