ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-12-26T23:49:23+05:30 IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల

ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,76,492కు చేరింది. ఈ రోజు నమోదైన మరణంతో కలిసి మొత్తం మరణాలు 14,490కు చేరాయి. ప్రస్తుతం 1166 యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఈ రోజు మరో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరికి ఒమైక్రాన్ వేరియంట్ నిర్ధారణ కావడంతో ఏపీలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒంగోలుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తితోపాటు యూకె నుంచి అనంతపురంకు వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల తర్వాత  ఒమైక్రాన్‌గా అధికారులు నిర్ధారించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ అందరికీ నెగటీవ్‌గా నిర్ధారణ అయింది.

Updated Date - 2021-12-26T23:49:23+05:30 IST