అమరావతికి భూములిస్తే అవమానాలా

ABN , First Publish Date - 2021-06-22T09:06:00+05:30 IST

అమరావతికి భూములిస్తే అవ మానాలు చేస్తారా.. అంటూ రాజధాని రైతులు తెలిపారు. అమరావతి ఉద్యమం సోమవారంతో 552 వ రోజుకు చేరుకుంది

అమరావతికి భూములిస్తే అవమానాలా

552వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, జూన్‌ 21: అమరావతికి  భూములిస్తే అవ మానాలు చేస్తారా.. అంటూ రాజధాని రైతులు  తెలిపారు. అమరావతి ఉద్యమం సోమవారంతో 552 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. రాజధానులు మార్చుకుంటూ పోతే, రాష్ట్ర అభివృద్ధి జరగదన్నారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్రాన్ని బలి చేయవద్దన్నారు. ఊపిరి ఉన్నంత వరకు అమరావతి కోసం పోరాటం చేస్తామన్నారు. ఐదు కోట్ల మంది రాజధాని అమరావతి కావాలని అడుగుతుంటే మూడు రాజధానుల చేస్తామని అడ్డగోలుగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతు దళిత జేఏసీ సభ్యులు మాట్లాడుతూ అమ్ముడు పోయిన వారు రాజధాని అమరావతిపై విమర్శలు చేయటం సిగ్గు చేటన్నారు.


అమరావతికి భూములిచ్చేటప్పుడు చప్పట్లు కొట్టిన ఇతర ప్రాంతాల వారు కొందరు  ఇప్పుడు విషం చిమ్ముతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు కావాలంటూ కిరాయి తీసుకుంటూ అమరావతిలో ఆందోళనల చేయిస్తున్న ప్రజాప్రతినిధులకు సమాజంలో తిరిగే అర్హత లేదన్నారు.  మూడు అంటూ ఉద్యమం చేసే వార పెయిడ్‌ ఆర్టిస్టులన్నారు. కరోనా సమయంలో వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తూ బ్లూమీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. రోజు వారి కూలి కోసం ఆత్మాభిమానాన్ని తకట్టు పెట్టవద ్దని తెలిపారు. జై అమరావతి అంటూ రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.  

Updated Date - 2021-06-22T09:06:00+05:30 IST