40 అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు బంద్‌

ABN , First Publish Date - 2021-08-27T09:16:49+05:30 IST

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 40 అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు నిలిపివేస్తూ ఉన్నత విద్యామండలి గురువారం..

40 అన్‌ఎయిడెడ్‌   డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు బంద్‌

అఫిలియేషన్‌ నిబంధనలు పాటించనందుకు చర్యలు 

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 40 అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు నిలిపివేస్తూ ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అఫిలియేషన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో ఏయూ పరిధిలో 6, ఏఎన్‌యూ పరిధిలో 8, ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలో 5, యోగి వేమన వర్సిటీ పరిధిలో 4, కృష్ణా విశ్వవిద్యాలయం కింద 13, రాయలసీమ విశ్వవిద్యాలయం కింద 3, విక్రమ సింహపురి వర్సిటీ కింద 1 డిగ్రీ కళాశాల చొప్పున ఉన్నాయి. మరోవైపు 257 డిగ్రీ కళాశాలల్లో గత మూడేళ్లుగా అడ్మిషన్లు లేని 454 కోర్సులను రద్దు చేయాలని, వాటిలో ప్రవేశాలు నిలిపేస్తున్నామని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. 

Updated Date - 2021-08-27T09:16:49+05:30 IST