ఏపీలో కొత్తగా 2765 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-10T00:15:03+05:30 IST

కొవిడ్‌ అంతకంతకూ కోరలు చాస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతోన్న పాజిటివ్‌ల సంఖ్య రెట్టింపవుతోంది.

ఏపీలో కొత్తగా 2765 కరోనా కేసులు

అమరావతి: కొవిడ్‌ అంతకంతకూ కోరలు చాస్తోంది.  ఏరోజుకారోజు నమోదవుతోన్న పాజిటివ్‌ల సంఖ్య రెట్టింపవుతోంది. దీంతో సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2765 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16, 422 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 


మరోవైపు గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం 3,21,182కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,746 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 15,472 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 402 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గురువారం ఒక్క రోజే 1,01,986 మందికి కరోనా పరీక్షలు చేశారు.


Updated Date - 2021-04-10T00:15:03+05:30 IST