రాష్ట్రంలో 20 లక్షలు దాటిన కేసులు

ABN , First Publish Date - 2021-08-21T08:37:44+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు 20 లక్షల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో 69,173 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,435 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

రాష్ట్రంలో 20 లక్షలు దాటిన కేసులు

20,00,038 

దేశంలో ఐదో రాష్ట్రంగా ఏపీ  

కొత్తగా 1,435 కేసులు.. 6 మరణాలు

అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు 20 లక్షల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో 69,173 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,435 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,00,038కి చేరుకుంది. కరోనాతో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 13,702కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. కాగా.. దేశవ్యాప్తంగా 20 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైన ఐదో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. 64 లక్షల కేసులతో మహారాష్ట్ర టాప్‌లో కొనసాగుతుండగా.. కేరళ (37లక్షలు), కర్ణాటక (29లక్షలు), తమిళనాడు (25లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజాగా చిత్తూరులో 199 మందికి వైరస్‌ సోకగా.. నెల్లూరులో 190, తూర్పుగోదావరిలో 178, కృష్ణాలో 175, పశ్చిమగోదావరిలో 154, గుంటూరులో 133, ప్రకాశంలో 109 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 19,70,864కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున కరోనాతో చనిపోయా

Updated Date - 2021-08-21T08:37:44+05:30 IST