ఏపీలో 11.21 లక్షల డోసులు

ABN , First Publish Date - 2021-05-18T08:53:28+05:30 IST

ఇప్పటి దాకా రాష్ట్రానికి 86,34,400 కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు ఉచితంగా పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో 75,13,031 డోసులు వినియోగించుకోగా, ప్రస్తుతం 11,21,369 డోసులు అందుబాటులో

ఏపీలో 11.21 లక్షల డోసులు

మొత్తం 86.34 లక్షలు ఉచితంగా పంపిణీ 

ఇందులో 75.13 లక్షలు వినియోగం 

దేశవ్యాప్తంగా 20.76 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు 

3 రోజుల్లో మరో 2.94 లక్షలు సరఫరా 

రాష్ట్రానికి కొత్త కేటాయింపు లేదు: కేంద్రం 


న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి దాకా రాష్ట్రానికి 86,34,400 కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు ఉచితంగా పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో 75,13,031 డోసులు వినియోగించుకోగా, ప్రస్తుతం 11,21,369 డోసులు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం 20,76,10,230  డోసులను ఉచితంగా పంపిణీ చేసినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందులో 18,71,13,705 డోసులు వినియోగించుకోగా, ప్రస్తుతం 2,04,96,525 డోసులు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. తెలంగాణకు ఇప్పటిదాకా 61,41,040 డోసులు సరఫరా చేసినట్టు పేర్కొంది. ఇందులో 54,47,805 డోసులు వినియోగించుకోగా, 6,93,235 డోసులు అందుబాటులో ఉన్నాయి. రాబోయే మూడు రోజుల్లో 2,94,660 డోసులను 10 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ డోసుల కేటాయింపుల్లో తెలుగు రాష్ర్టాలకు అవకాశం దక్కలేదు.

Updated Date - 2021-05-18T08:53:28+05:30 IST