పెరుగు పకోడీ

ABN , First Publish Date - 2020-05-30T17:41:40+05:30 IST

పెసరపప్పు - ఒక కప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, పెరుగు - ఒక కప్పు

పెరుగు పకోడీ

కావలసినవి: పెసరపప్పు - ఒక కప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, కారం - పావు టీస్పూన్‌, నల్ల రాతి ఉప్పు - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ధనియాలు - ఒక టీస్పూన్‌.


తయారీ: పెసరపప్పును నీళ్లలో 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు తీసేసి మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, ధనియాలు, కొత్తిమీర వేసి కలపాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేయాలి. గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. మరొక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని అందులో వేగించి పెట్టుకున్న పకోడీలు వేయాలి. రెండు, మూడు నిమిషాలు నీళ్లలో నానిన తరువాత తీసి మరో బౌల్‌లో వేయాలి. మరొక బౌల్‌లో పెరుగు తీసుకొని ఉప్పు, జీలకర్రపొడి, కారం, మిరియాల పొడి, నల్ల రాతి ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో పకోడీలు వేయాలి. కొత్తిమీర, కారం చల్లుకుని ఈవినింగ్‌ స్నాక్‌గా సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-05-30T17:41:40+05:30 IST