పొటాటో లాలిపాప్స్

ABN , First Publish Date - 2020-06-22T20:12:17+05:30 IST

ఎండిన మిల్క్‌బ్రెడ్‌ స్లయిస్‌లు - 4, ఉడికించిన బంగాళ దుంపలు - 2, ఉల్లి తరుగు - అర కప్పు, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌ - ఒక టీ స్పూను, అల్లం తరుగు - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను

పొటాటో లాలిపాప్స్

కావలసిన పదార్థాలు: ఎండిన మిల్క్‌బ్రెడ్‌ స్లయిస్‌లు - 4, ఉడికించిన బంగాళ దుంపలు - 2, ఉల్లి తరుగు - అర కప్పు, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌ - ఒక టీ స్పూను, అల్లం తరుగు - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను, చాట్‌ మసాలా - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు, మైదా జారు - అరకప్పు, నూనె - వేగించడానికి సరిపడా, జీరా పొడి, చాట్‌ మసాల, గరం మసాలా - అర టీ స్పూను చొప్పున. 


తయారుచేసే విధానం: మిల్క్‌బ్రెడ్‌ని తుంచి మిక్సీలో బరకగా పొడి చేసి పక్కనుంచాలి. ఒక పాత్రలో ముప్పావు వంతు బ్రెడ్‌ పొడితో పాటు బంగాళదుంప గుజ్జు, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌, అల్లం తరుగు, పచ్చిమిర్చి, జీరాపొడి, చాట్‌ మసాల, గరం మసాల, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఉండలు చేయాలి. వీటిని మైదా జారులో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి నూనెలో దోరగా వేగించి తీయాలి.  

Updated Date - 2020-06-22T20:12:17+05:30 IST