మజ్జిగ సంకటి

ABN , First Publish Date - 2020-10-03T17:16:33+05:30 IST

బియ్యప్పిండి - రెండు కప్పులు, పులిసిన మజ్జిగ - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, పసుపు - అరస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌,

మజ్జిగ సంకటి

కావలసినవి: బియ్యప్పిండి - రెండు కప్పులు, పులిసిన మజ్జిగ - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, పసుపు - అరస్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు.


తయారీ విధానం: బియ్యప్పిండిలో మజ్జిగ, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి పలుచగా కలపాలి. స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి వేగించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కలిపిపెట్టుకున్న బియ్యప్పిండిని నెమ్మదిగా పోయాలి. అడుగంటకుండా కలపాలి. కొద్దిగా వెన్న ముద్దలా ఉన్నప్పుడే దింపాలి.


Updated Date - 2020-10-03T17:16:33+05:30 IST