మ్యాగీ న్యూడిల్ కట్లెట్స్

ABN , First Publish Date - 2020-06-22T20:13:51+05:30 IST

మ్యాగీ పాకెట్లు - 2, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను చొప్పున, ఉల్లి తరుగు - అరకప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, కారం, మిర్యాలపొడి

మ్యాగీ న్యూడిల్ కట్లెట్స్

కావలసిన పదార్థాలు: మ్యాగీ పాకెట్లు - 2, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను చొప్పున, ఉల్లి తరుగు - అరకప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, కారం, మిర్యాలపొడి - అర టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, మ్యాగీ మసాల పొడి - ఒక టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, బంగాళదుంపలు - 2, మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు.


తయారుచేసే విధానం: ఒక మ్యాగీ పొట్లం చిదిమి కడాయిలో దోరగా వేగించి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లి, క్యారెట్‌ తరుగు వేసి 3 నిమిషాలు మాడకుండా ఫ్రై చేయాలి. తర్వాత కారం, ఉప్పు, మిర్యాలపొడులు, ఉడికించి చిదిమిన బంగాళదుంప గుజ్జు వేసి బాగా కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత కట్లెట్స్‌గా ఒత్తుకుని మైదా జారులో ముంచాలి. వీటికి చిదిమిన మ్యాగీ అద్ది నూనెలో దోరగా వేగించాలి. ఈ కట్లెట్స్‌కి టమోటా కెచప్‌ మంచి కాంబినేషన్‌.

Updated Date - 2020-06-22T20:13:51+05:30 IST