నల్లబెల్లం సంకటి

ABN , First Publish Date - 2020-10-03T17:29:12+05:30 IST

బియ్యప్పిండి - అరకేజీ, పుట్నాలు - అరకేజీ, మెంతులు - 50గ్రా, శొంఠి - 50గ్రా, నల్లబెల్లం - ఒకకప్పు, నూనె - అరకప్పు, నీళ్లు - తగినన్ని.

నల్లబెల్లం సంకటి

కావలసినవి: బియ్యప్పిండి - అరకేజీ, పుట్నాలు - అరకేజీ, మెంతులు - 50గ్రా, శొంఠి - 50గ్రా, నల్లబెల్లం - ఒకకప్పు, నూనె - అరకప్పు, నీళ్లు - తగినన్ని.


తయారీ విధానం: ముందుగా పుట్నాలు, మెంతులు, శొంఠిని విడివిడిగా వేగించుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి తీసుకుని అందులో వేగించిన పుట్నాలు, మెంతులు, శొంఠి వేసి మిక్సీలో గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. నీళ్లు వేడెక్కిన తరువాత నల్ల బెల్లం వేసి ఉడికించాలి. కాస్త ఉడికిన తరువాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. వడకట్టిన నీటిని మళ్లీ మరిగించాలి. మరో పాత్రలో కొద్దిగా నూనె వేసి, గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పిండి వేసి కలపాలి. తరువాత స్టవ్‌ సిమ్‌లో పెట్టి మరిగించిన బెల్లం నీటిలో కొద్దిగా కలపాలి. 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని దింపాలి. కాసేపయ్యాక బెల్లం నీరు తేరుకుంటుంది. దీన్ని వడకట్టి పెట్టుకోవాలి. చేతికి నూనె రాసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. 


Updated Date - 2020-10-03T17:29:12+05:30 IST