సమోసా చాట్‌

ABN , First Publish Date - 2020-01-18T18:00:17+05:30 IST

సెనగలు - ఒక కప్పు, నూనె - కొద్దిగా, వాము - అర టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, అల్లంవెల్లుల్లిపేస్టు - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - మూడు, పసుపు -పావు టీస్పూన్‌, కారం - టీస్పూన్‌, ధనియాల పొడి - టీస్పూన్‌, గరంమసాలా - టీస్పూన్‌, మామిడికాయ పొడి - టీస్పూన్‌, ఉప్పు -

సమోసా చాట్‌

కావలసినవి: సెనగలు - ఒక కప్పు, నూనె - కొద్దిగా, వాము - అర టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, అల్లంవెల్లుల్లిపేస్టు - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - మూడు, పసుపు -పావు టీస్పూన్‌, కారం - టీస్పూన్‌, ధనియాల పొడి - టీస్పూన్‌, గరంమసాలా - టీస్పూన్‌, మామిడికాయ పొడి - టీస్పూన్‌, ఉప్పు - తగినంత, సమోసాలు - ఆరు, పుదీనా చట్నీ -చిన్నకప్పు, అల్లం చట్నీ - చిన్న కప్పు, కారపూస - రెండు టేబుల్‌స్పూన్లు, చాట్‌మసాలా -టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మరసం - టీస్పూన్‌.
 
తయారీ: సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్లు తీసేసి సెనగలు పక్కన పెట్టాలి. ఒక పాత్రలో వాము, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేసి కలపాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలియబెట్టాలి. మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి దోరగా వేగించి, సెనగలు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత గరంమసాలా, మామిడికాయ పొడి వేసి కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు చిన్న మంటపై ఉడికించాలి. ప్లేట్‌లో సమోసా తీసుకుని, కొద్దిగా చిదిమి వేడి వేడి మసాలాను లేయర్‌గా వేసుకోవాలి. పుదీనా చట్నీ, అల్లం చట్నీ, తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
చాట్‌ మసాలా చల్లి, కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి. నిమ్మరసం పిండుకుని తింటే ఈ చాట్‌
సూపర్‌గా ఉంటుంది.

Updated Date - 2020-01-18T18:00:17+05:30 IST