టొమాటో మిరియాల సూప్‌

ABN , First Publish Date - 2020-07-11T18:14:11+05:30 IST

టొమాటోలు - మూడు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, అల్లం ముక్క - చిన్నది, దాల్చిన చెక్క - చిన్నది, ఉల్లిపాయ - ఒకటి, నూనె - ఒక టీస్పూన్‌, పుదీనా - కొద్దిగా.

టొమాటో మిరియాల సూప్‌

కావలసినవి: టొమాటోలు - మూడు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, అల్లం ముక్క - చిన్నది, దాల్చిన చెక్క - చిన్నది, ఉల్లిపాయ - ఒకటి, నూనె - ఒక టీస్పూన్‌, పుదీనా - కొద్దిగా.


తయారీ: ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు పోసి అందులో టొమాటోలు, అల్లం, దాల్చినచెక్క, మిరియాల పొడి వేసి మరిగించాలి. మిశ్రమం చల్లారిన తరువాత టొమాటోలను గుజ్జుగా చేయాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత టొమాటో మిశ్రమం వేయాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. చిన్న మంటపై ఉడికించాలి. మిరియాల పొడి చల్లుకుని, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-07-11T18:14:11+05:30 IST