తరగ
ABN , First Publish Date - 2020-10-24T21:49:46+05:30 IST
కర్ణాటకలో దసరా రోజున ప్రతి ఇంట్లో ఈ వంటకం వండుతారు.

కర్ణాటకలో దసరా రోజున ప్రతి ఇంట్లో ఈ వంటకం వండుతారు.
కావలసినవి: మైదా - ఒకకప్పు, సెనగపిండి - రెండు కప్పులు, వాము - ఒక టీస్పూన్, కారం - ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: ఒక వెడల్పాటి పాత్రలో మైదా తీసుకుని అందులో సెనగపిండి, వాము, కారం, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తటి మిశ్రమంలా కలపాలి. తరువాత కొద్దిగా నూనె రాసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ పూరీల్లా చేసుకోవాలి. వీటిని నూనెలో వేగించి తీసుకుంటే కరకరలాడే తరగలు రెడీ.