స్పైసీ కేక్
ABN , First Publish Date - 2020-07-25T17:40:00+05:30 IST
స్వీట్‌కార్న్ - ఒక కప్పు, కార్న్ దాలియా - ఒక కప్పు, పెరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు,

కావలసినవి: స్వీట్‌కార్న్ - ఒక కప్పు, కార్న్ దాలియా - ఒక కప్పు, పెరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్, ఉప్పు - తగినంత, ఫ్రూట్సాల్ట్ - ఒక టీస్పూన్, అల్లం - కొద్దిగా, నిమ్మరసం - అర టీస్పూన్, పంచదార - అరటీస్పూన్, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - తగినంత, ఆవాలు - అర టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, కారం - అర టీస్పూన్.
తయారీ: ముందుగా మిక్సీలో స్వీట్‌కార్న్ వేసి, తరువాత అల్లం, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కార్న్ దాలియా, పెరుగు వేసి కలపాలి. తరువాత ఇంగువ, పసుపు, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి కలియబెట్టాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్ల లాంటి పాత్ర తీసుకోవాలి. చతురస్రాకారంలో మౌల్డ్ ఉన్న పాత్ర అయితే మరీ మంచిది. దానిపై కొద్దిగా నూనె రాయాలి. తరువాత పక్కన పెట్టుకున్న మిశ్రమానికి ఫ్రూట్ సాల్ట్ కలిపి మౌల్డ్ ప్లేట్స్‌పై పోయాలి. పావుగంట పాటు ఆవిరిపై ఉడికించాలి. స్టవ్‌పై ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. కరివేపాకు, ఇంగువ, కారం వేసి కలపాలి. ఈ పోపు మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో కార్న్ కేక్‌పై చల్లాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.