గుమ్మడికాయ సూప్
ABN , First Publish Date - 2020-08-01T19:16:18+05:30 IST
గుమ్మడికాయ - ఒకటిన్నర కిలో, ఆలివ్ ఆయిల్ - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, ఉ

కావలసినవి: గుమ్మడికాయ - ఒకటిన్నర కిలో, ఆలివ్ ఆయిల్ - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - మూడు, వెజిటబుల్ స్టాక్ - ఒక లీటరు, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్, మిరియాల పొడి - అర టీస్పూన్, క్యారెట్ - ఒకటి, ఉప్పు - తగినంత.
తయారీ: ముందుగా ఓవెన్‌ను 170 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయాలి. గుమ్మడికాయను ముక్కలుగా కట్ చేయాలి. తరువాత ఒక బేకింగ్ ట్రేలోకి తీసుకొని వాటిపైన ఆలివ్ ఆయిల్ చల్లాలి. ఎండుమిర్చి, ధనియాలను మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ పొడిని గుమ్మడికాయ ముక్కలపై చల్లాలి. మిరియాల పొడి కూడా చల్లాలి. తరువాత ఓవెన్లో పెట్టి 45 నిమిషాల పాటు ఉడికించాలి. వెడల్పాటి పాన్ స్టవ్‌పై పెట్టి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేయాలి. నూనె వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి, పావుగంటపాటు చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను ఓవెన్‌లోంచి బయటకు తీసి, వెజిటబుల్ స్టాక్ కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వెజిటబుల్ స్టాక్ వేగుతున్న పాన్‌లో పోయాలి. మరికాసేపు ఉడికించి దింపి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.