ఉల్లిపాయ కబాబ్‌

ABN , First Publish Date - 2020-12-19T17:14:09+05:30 IST

ఉల్లిపాయలు - ఒక కేజీ, లెమన్‌గ్రాస్‌ - 200గ్రా, ఎండుమిర్చి - ఒకటి, పచ్చిమిర్చి - ఐదు, అల్లం - చిన్నముక్క, పుదీన - 200గ్రా, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కొత్తిమీర -

ఉల్లిపాయ కబాబ్‌

కావలసినవి: ఉల్లిపాయలు - ఒక కేజీ, లెమన్‌గ్రాస్‌ - 200గ్రా, ఎండుమిర్చి - ఒకటి, పచ్చిమిర్చి - ఐదు, అల్లం - చిన్నముక్క, పుదీన - 200గ్రా, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - 200గ్రా, జాజికాయ పొడి - అర టీస్పూన్‌, మైదా - అరకప్పు, స్వీట్‌  సోడా - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నెయ్యి - అరకేజీ, మొక్కజొన్న పిండి - ఒకటిన్నర కప్పు.


సాస్‌ కోసం: వాల్‌నట్స్‌ - 200గ్రా, నిమ్మరసం - అర టీస్పూన్‌; బెల్లం - 50గ్రా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, చింతపండు - వంద గ్రాములు.


తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరగాలి. తరువాత అందులో లెమన్‌గ్రాస్‌, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం వేసి బాగా కలియబెట్టాలి. ఎండు మిర్చి పొడి పొడి అయ్యేలా కలపాలి. స్వీట్‌ సోడా, పుదీనా, జీలకర్ర, కొత్తిమీర, జాజికాయ పొడి, మైదా, మొక్కజొన్న పిండి వేసి కలియబెట్టాలి. తరువాత మిశ్రమాన్ని కొద్దిగా చేతుల్లోకి తీసుకుని కబాబ్‌లుగా తయారుచేసుకుంటూ నూనెలో వేగించాలి. వీటిని సాస్‌తో తింటే టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్‌లో వాల్‌నట్స్‌ను పొడి చేసి నిమ్మరసం కలపాలి. బెల్లం, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అరకప్పు నీళ్లు పోసి పదినిమిషాలు ఉడికించాలి. చింతపండు నీళ్లు పావు కప్పు పోసి మరికాసేపు ఉడికించితే సాస్‌ రెడీ.

Read more