చికెన్ పకోడా (వీడియో)

ABN , First Publish Date - 2020-06-19T17:36:53+05:30 IST

ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, ఒక స్పూన్ ధనియాపొడి, గరం మసాలా, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసి

చికెన్ పకోడా (వీడియో)

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, ఒక స్పూన్ ధనియాపొడి, గరం మసాలా, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు, కొద్దిగా నిమ్మరసం, ఒక గుడ్డు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి.


ఆ మిశ్రమాన్ని పదిహేను నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇపుడు బాణీలో సగం వరకు నూనె పోసి బాగా మరగనివ్వాలి. ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటి వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే ఈ వర్షకాలంలో చికెన్ పకోడా బాగా ఎంజాయ్ చేయొచ్చు.

Updated Date - 2020-06-19T17:36:53+05:30 IST