చికెన్ కర్రీ (వీడియో)

ABN , First Publish Date - 2020-06-25T22:09:08+05:30 IST

ముందుగా కడాయిలో నూనె వేసి వేడయ్యాక అందులో చిన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేగించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. పచ్చి

చికెన్ కర్రీ (వీడియో)

తయారీ విధానం: ముందుగా కడాయిలో నూనె వేసి వేడయ్యాక అందులో చిన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేగించుకోవాలి. తరువాత  పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగించి, తర్వాత అందులో పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుని, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. మిశ్రమం కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాట ముక్కల్ని వేసి మెత్తగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికి మంట తీసేసేముందు కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే సరిపోతుంది.

Updated Date - 2020-06-25T22:09:08+05:30 IST