కడాకనీ

ABN , First Publish Date - 2020-10-24T21:46:37+05:30 IST

మహారాష్ట్రీయులు దసరా పర్వదినాన కడాకనీ అనే ప్రత్యేకమైన స్వీట్‌ను తయారుచేసి అతిథులకు అందిస్తారు. పచ్చిమిర్చి చట్నీతో తింటే ఈ వంటకం రుచిగా ఉంటుంది. దీని తయారీకి...

కడాకనీ

మహారాష్ట్రీయులు దసరా పర్వదినాన కడాకనీ అనే ప్రత్యేకమైన స్వీట్‌ను తయారుచేసి అతిథులకు అందిస్తారు. పచ్చిమిర్చి చట్నీతో తింటే ఈ వంటకం రుచిగా ఉంటుంది. దీని తయారీకి...


కావలసినవి: మైదా - అరకప్పు, పంచదార - మూడు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, రవ్వ - అరకప్పు.


తయారీ విధానం: ఒక పాత్రలో పంచదార తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పంచదార పూర్తిగా కరిగే వరకు పక్కన పెట్టాలి. మరొక పాత్రలో మైదా తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి కలపాలి. తరువాత పంచదార నీళ్లు వేసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి పైన కొద్దిగా నూనె రాసి గంట పాటు పక్కన పెట్టాలి. తరువాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పూరీల్లా ఒత్తుకోవాలి. ఫోర్క్‌ సహాయంతో వాటికి చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇలా రంధ్రాలు చేయడం వల్ల పూరీల మాదిరిగా పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత కడాకనీలు వేసి రెండు వైపులా ముదురు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.అంతే... నోరూరించే కడాకనీలు రెడీ.

Updated Date - 2020-10-24T21:46:37+05:30 IST