బరడా పాల్యా (సెనగపప్పు బరడా)
ABN , First Publish Date - 2020-10-31T17:50:21+05:30 IST
సెనగపప్పు - వంద గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంముక్క - చిన్నది, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, ఆవాలు -

కావలసినవి: సెనగపప్పు - వంద గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంముక్క - చిన్నది, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, ఆవాలు - అర టీస్పూన్, కరివేపాకు - ఒక రెబ్బ, కొత్తిమీర - కొద్దిగా, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: సెనగపప్పును గంట పాటు నానబెట్టాలి. తరువాత కుక్కర్‌లో వేసి, కాస్త పసుపు వేసి ఉడికించాలి. ఆవిరి పోయాక నీళ్లు తీసేసి, చేత్తో పొడిపొడిగా నలిపి పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలి పెట్టి కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత పసుపు, కారం వేయాలి. నలిపి పెట్టుకున్న పప్పు వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర వేయాలి. అంతే... రుచికరమైన బరడా పాల్యా సిద్ధం.
సెనగపప్పు
క్యాలరీలు - 160
ప్రోటీన్ - 9.98 గ్రా
కార్బోహైడ్రేట్లు - 26.49 గ్రా
ఫ్యాట్ - 2.14 గ్రా
