అంబ్రే షియా ముర్గ్‌

ABN , First Publish Date - 2020-11-07T17:40:31+05:30 IST

చికెన్‌ (బోన్‌లెస్‌) - ఒకకేజీ, పెరుగు - 150గ్రా, నిమ్మరసం - 10ఎంఎల్‌, అల్లం వెల్ల్లుల్లి - 50గ్రా, జీలకర్ర పొడి

అంబ్రే షియా ముర్గ్‌

కావలసినవి: చికెన్‌ (బోన్‌లెస్‌) - ఒకకేజీ, పెరుగు - 150గ్రా, నిమ్మరసం - 10ఎంఎల్‌, అల్లం వెల్ల్లుల్లి - 50గ్రా, జీలకర్ర పొడి - 10గ్రా, గరంమసాలా - 15గ్రా, కశ్మీరీ కారం - 50గ్రా, ఉప్పు - రుచికి తగినంత.


గ్రేవీ తయారీ కోసం: నూనె - 200 ఎం.ఎల్‌, ఉల్లిపాయ - 50గ్రా, అల్లంవెల్లుల్లి పేస్టు - 15గ్రా, జీలకర్రపొడి - 15గ్రా, పసుపు - 5గ్రా, ధనియాల పొడి - 50గ్రా, గరంమసాలా - 5గ్రా, మెంతి - 5గ్రా, టొమాటో ప్యూరీ - 50గ్రా, జీడిపప్పు - 50గ్రా, వెన్న - 25గ్రా, కొత్తిమీర - 25గ్రాములు.


తయారీ విధానం: చికెన్‌ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత పెరుగు, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, గరంమసాలా, కశ్మీరీ కారం వేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఓవెన్‌ను ముందుగానే 260 డిగ్రీసెల్సియస్‌లో హీట్‌ చేసుకోవాలి. ట్రేపై గ్రీస్‌ పేపర్‌ వేసి మారినేట్‌ చేసిన చికెన్‌ పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. గ్రేవీ తయారీ కోసం స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి. జీలకర్రపొడి, పసుపు, ధనియాల పొడి, కశ్మీరీ కారం, మెంతి ఆకులు, గరంమసాలా వేసి కలపాలి. పావు గంటపాటు వేగించిన తరువాత టొమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్టు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. ఈ గ్రేవీలో చికెన్‌ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దింపాలి.


వందగ్రాముల చికెన్‌లో పోషకవిలువలు

క్యాలరీలు 239

ఫ్యాట్‌ 14గ్రా

ప్రొటీన్‌ 27గ్రా

కార్బోహైడ్రేట్లు 0Updated Date - 2020-11-07T17:40:31+05:30 IST