కరోనాపై పోరుకు జీ తెలుగు చేయూత

ABN , First Publish Date - 2020-06-23T02:37:55+05:30 IST

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి జీ తెలుగు తమ వంతు చేయూతనందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని...

కరోనాపై పోరుకు జీ తెలుగు చేయూత

హైదరాబాద్: కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి జీ తెలుగు తమ వంతు చేయూతనందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అధికారులకు పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర అత్యవసర పరికరాలను అందించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. కరోనా కేసులు నానాటికీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సామాజికంగా, ఆర్థికంగా దేశం తీవ్ర స్థాయిలో నష్టపోతోంది. అంతేకాకుండా కరోనా బాధితులందరికీ వైద్య సదుపాయాలు అందించడంలో వైద్యులపై పెను భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో జీ నెట్‌వర్క్ యాజమాన్యం ప్రభుత్వాలకు అండగా నిలవాలని భావించింది. అందులో భాగంగా దేశంలోని 10 నగరాల్లో వైద్యులకు, అధికారులకు అవరసమైన రక్షణ పరికరాలను అందించాలని తలచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా జీ తెలుగు ద్వారా అండగా నిలుస్తోంది. దాదాపు 4000 పీపీఈ కిట్లు, 16 ఆంబులెన్సులను అందించి కరోనా పోరులో ప్రభుత్వంతో చేతులు కలిపింది. దీనికి తోడు తమ చానల్‌‌లో పనిచేస్తున్న సుమారు 400 మంది రోజువారీ కూలీల కుటుంబాలకు కూడా రూ.35 లక్షలు అందించింది. 


ఇదిలా ఉంటే ప్రభుత్వాలకు చేయూతనందించడంలో భాగంగా జీ నెట్‌వర్క్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక పరికరాలను అందించనుంది. దాదాపు 40,000 పీపీఈ కిట్లు, 200 ఆంబులెన్సులు, 100 పోర్టబుల్ ఐసీయూ కిట్లు అందజేయనుంది. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల కోసం ప్రతి రోజూ 6 లక్షల భోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2020-06-23T02:37:55+05:30 IST