నెహ్రూయువక కేంద్ర ఆధ్వర్యంలో ‘నార్త్‌ ఈస్ట్‌యూత్‌ఎక్స్‌ఛేంజ్‌ మేళా’

ABN , First Publish Date - 2020-03-02T23:12:41+05:30 IST

నెహ్రూ యువక కేంద్ర హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు జరిగే ‘నార్త్‌ ఈస్ట్‌ యూత్‌ఎక్స్‌ఛేంజ్‌ మేళా’ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

నెహ్రూయువక కేంద్ర ఆధ్వర్యంలో ‘నార్త్‌ ఈస్ట్‌యూత్‌ఎక్స్‌ఛేంజ్‌ మేళా’

హైదరాబాద్‌: నెహ్రూ యువక కేంద్ర హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఆరు  రోజుల పాటు జరిగే ‘నార్త్‌ ఈస్ట్‌ యూత్‌ఎక్స్‌ఛేంజ్‌ మేళా’ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రాజేంద్ర నగర్‌లోని కోఆపరేటివ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా యువ సమన్వయకర్త ఖుష్బూగుప్త తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగాలాండ్‌, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపుర, అస్సాం, మణిపూర్‌  రాష్ర్టాల నుంచి 250 మంది యూత్‌, 25 మంది టీం లీడర్స్‌ పాల్గొంటున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం యోగా, శ్రమదానం, పర్యావరణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, జాతీయ సమైక్యత, కేరీర్‌గైడెన్స్‌, స్కిల్‌డెవలప్‌మెంట్‌, సత్ప్రవర్తన, సంస్కృతులు, సాంప్రదాయాలు , సంఘసేవవా కార్యక్రమాలు, పరిచయాలు, అభిప్రాయసేకరణ, ఎన్‌ఐఆర్‌డి రాజేంద్రనగర్‌లో రూరల్‌టెక్నాలజీ పార్క్‌సందర్శన, చారిత్రకస్థలాల సందర్శన తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈకార్యక్రమాన్ని న్యూఢిల్లీ నెహ్రూయువకకేంద్ర వైస్‌ఛైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డిప్రారంభిస్తారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నెహ్రూ  యువకకేంద్ర డైరెక్టర్‌ ప్రమోద్‌హింజ్‌, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ఐ అండ్‌ పిఆర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ తదితరులు పాల్గొననున్నారు. 

Updated Date - 2020-03-02T23:12:41+05:30 IST