మీ భయమే.. మా సంపాదనకు ఆయుధం!

ABN , First Publish Date - 2020-03-19T10:13:35+05:30 IST

ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని కొందరు అక్రమార్కులు తమ సంపాదనకు ఆయుధంగా వాడుకుంటున్నారు. నకిలీ శానిటైజర్లను

మీ భయమే.. మా సంపాదనకు ఆయుధం!

హైదరాబాద్‌లో నకిలీ శానిటైజర్ల దందా.. పలు కేంద్రాల సీజ్‌

హైదరాబాద్‌ సిటీ/ఏఎ్‌సరావునగర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని కొందరు అక్రమార్కులు తమ సంపాదనకు ఆయుధంగా వాడుకుంటున్నారు. నకిలీ శానిటైజర్లను తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. మార్కెట్‌లో మాస్కులు, శానిటైజర్లకు భారీగా డిమాండ్‌, కొరత ఉండటంతో ప్రజలు అసలు, నకిలీలతో సంబంధం లేకుండా శానిటైజర్లను కొంటున్నారు. దీంతో నకిలీల దందా యథేచ్ఛగా సాగుతోంది.  చిన్న చిన్న వ్యాపారులు తమ ఇళ్లలోనే నకిలీ శానిటైజర్లను తయారు చేస్తుండగా, పెద్ద వ్యాపారులు ఏకంగా ఇప్పటికే ఉన్న తమ కార్ఖానాల్లో సైడ్‌ బిజినెస్‌ ప్రారంభించేశారు.


ఎవరికి వారే వారికి తోచినంత మొత్తంలో ఎమ్మార్పీ స్టిక్కర్లను అతికిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్‌తో పాటు కుషాయిగూడ పరిధిలోని నకిలీ శానిటైజర్ల కేంద్రాలను గుర్తించి దాడి చేశారు. వాటిని సీజ్‌ చేశారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ముగ్గురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసి, రూ. 40 లక్షల విలువైన శానిటైజర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-03-19T10:13:35+05:30 IST