క్వారంటైన్‌ను తప్పించుకుని స్వగ్రామానికి.. మంచిర్యాల జిల్లా యువకుడు

ABN , First Publish Date - 2020-03-23T12:45:39+05:30 IST

మంచిర్యాల: క్వారంటైన్‌ను తప్పించుకుని ఇప్పటికి కూడా కొందరు ఇళ్లకు చేరుకుంటున్నారు.

క్వారంటైన్‌ను తప్పించుకుని స్వగ్రామానికి.. మంచిర్యాల జిల్లా యువకుడు

మంచిర్యాల: క్వారంటైన్‌ను తప్పించుకుని ఇప్పటికి కూడా కొందరు ఇళ్లకు చేరుకుంటున్నారు. నేడు జింబాబ్వే నుంచి వచ్చిన ఓ యువకుడు స్వగ్రామానికి చేరటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గోండుగూడ గ్రామానికి చెందిన యువకుడు క్వారంటైన్‌ను తప్పించుకుని స్వగ్రామానికి చేరాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. సదరు యువకుడు జింబాబ్వే నుంచి ముంబై, హైదరాబాద్ మీదుగా స్వగ్రామానికి వచ్చినట్టు విచారణలో తేలింది.


Updated Date - 2020-03-23T12:45:39+05:30 IST