చిక్కడపల్లి ఎస్సైపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-04-28T18:04:49+05:30 IST
హైదరాబాద్: చిక్కడపల్లి ఎస్పైపై ఓ యువకుడు సీపీకి ఫిర్యాదు చేశాడు. ఓ కేసు విషయంలో శ్రీధర్ అనే యువకుడి.

హైదరాబాద్: చిక్కడపల్లి ఎస్పైపై ఓ యువకుడు సీపీకి ఫిర్యాదు చేశాడు. ఓ కేసు విషయంలో శ్రీధర్ అనే యువకుడి నుంచి రూ.20వేలను ఎస్సై కిషోర్ అప్పుగా తీసుకున్నారు. బంగారం తాకట్టు పెట్టి మరీ శ్రీధర్ డబ్బు తీసుకొచ్చి ఎస్సైకి ఇచ్చాడు. అయితే లాక్‌డౌన్ వేళ ఇబ్బందిగా ఉందని డబ్బులు తిరిగివ్వమని ఎస్సైని శ్రీధర్ కోరాడు. అయితే తాను ఆ డబ్బులు ఇవ్వనంటూ.. ఎస్సై కిషోర్ దుర్భాషలాడారని శ్రీధర్ సీపీకి ఫిర్యాదు చేశాడు.