ఏమైందో ఏమో...
ABN , First Publish Date - 2020-12-16T04:42:25+05:30 IST
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న
యువకుడి ఆత్మహత్య
తెలియని వివరాలు
పర్వతగిరి, డిసెంబరు 15: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కల్లెడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై ప్రశాంత్‌బాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముదురకోల రాము (24) వాయిదా పద్ధతిలో గృహోపకరణాలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. ఏమైందో ఏమో సోమవారం పర్వతగిరిలోని రిజర్వాయర్ సమీపంలో పురుగుల మందు తాగి అచేతనంగా పడి ఉండగా, స్థానికులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. రాము తండ్రి ఉప్పలయ్య మంగళవారం ఫిర్యాదు చేయడంతో విషయం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాముకు ఇటీవల పెళ్లి జరిగినట్టు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. పుట్టెడు బాధలోనూ కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు.