స్నేహితులతో పార్టీకి వెళ్లి తిరిగిరాని యువకుడు
ABN , First Publish Date - 2020-12-11T04:46:28+05:30 IST
కాట్రపల్లికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. కాట్రపల్లికి చెందిన బొమ్మకంటి వెంకటేష్(21) కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు.

స్నేహితులతో పార్టీకి వెళ్లి తిరిగిరాని యువకుడు
అనుమానాస్పదస్థితిలో చెరువులో దొరికిన మృతదేహం
శాయంపేట, డిసెంబరు 10 : కాట్రపల్లికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. కాట్రపల్లికి చెందిన బొమ్మకంటి వెంకటేష్(21) కూలీ పని చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం 9న రాత్రి భార్య సుస్మితతో స్నేహితులు పార్టీ ఇస్తున్నారని చెప్పి బైక్‌పై వెళ్లాడు. భార్య రాత్రి 10గంటల సమయంలో వెంకటేష్‌కు ఫోన్ చేయగా ఇంటికి వస్తున్నాని చెప్పాడు. రాత్రంతా ఎదురుచూసినా అతడు రాలేదు. గురువారం ఉదయం స్థానికులు బహిర్భూమికి వెళ్లగా వెంకటేష్ బైక్ గుంటిచెరువు పక్కన పడి ఉండడం గమనించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు చెరువు దగ్గరికి వెళ్లి వెతకగా వెంకటేష్ మృతదేహం దొరికింది. మృతుడి తండ్రి బొమ్మకంటి శాంతికుమార్ మృతిపై అనుమానం ఉందని, ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.