జగిత్యాల : కేక్‌ను తల్వార్‌తో కట్ చేసిన యువకుడు

ABN , First Publish Date - 2020-07-12T16:34:14+05:30 IST

జగిత్యాల జిల్లా : జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో బర్త్ డే పార్టీలో తల్వార్‌తో యువకుడు కలకలం సృష్టించాడు.

జగిత్యాల : కేక్‌ను తల్వార్‌తో కట్ చేసిన యువకుడు

జగిత్యాల జిల్లా : జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో బర్త్ డే పార్టీలో తల్వార్‌తో యువకుడు కలకలం సృష్టించాడు. కేక్‌ను తల్వార్‌తో కట్ చేసిన యువకుడు హల్ చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. పలువురు యువకులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడితో సహా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా తల్వార్‌తో కేక్ కట్ చేయడాన్ని యువకులు ఓ ఫ్యాషన్‌గా భావించి పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పటికే కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల్లో ఇలా చేసిన వారిని అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.

Updated Date - 2020-07-12T16:34:14+05:30 IST