హైదరాబాద్ పార్క్‌ హయత్ హోటల్‌లో దారుణం

ABN , First Publish Date - 2020-10-14T01:00:00+05:30 IST

పార్క్ హయత్ హోటల్‌లో దారుణం జరిగింది. ముంబై నుంచి వచ్చిన యువతిపై జుబేర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. బర్తడే పార్టీకి...

హైదరాబాద్ పార్క్‌ హయత్ హోటల్‌లో దారుణం

హైదరాబాద్: పార్క్ హయత్ హోటల్‌లో దారుణం జరిగింది. ముంబై నుంచి వచ్చిన యువతిపై జుబేర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. బర్తడే పార్టీకి పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ముంబై పోలీసులకు యువతి ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు యువతులు కూడా కామాంధుడికి సహకరించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. 


అయితే ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులకు ముంబై పోలీసులు బదిలీ చేశారు. నిందితుడితో పాటు అతడికి సహకరించిన  ఇద్దరు యువతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు దుస్తులు మార్చుకునే సమయంలో ఓ యువతి వీడియో తీసిందని, న్యూడ్ వీడియోలు వాట్సాప్ చేసి కేసు వాపస్ తీసుకోవాలని నిందుతుడు, ఇద్దరు యువతులు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు చెప్పారు. 


Updated Date - 2020-10-14T01:00:00+05:30 IST