ప్రేమ పెళ్లిని నిరాకరించారన్న మనస్తాపంతో...
ABN , First Publish Date - 2020-02-10T13:55:20+05:30 IST
ప్రేమ పెళ్లిని నిరాకరించారన్న మనస్తాపంతో...
జైపూర్: మంచిర్యాలలో వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. జైపూర్ మండలం కుందారంలో ప్రేమ పెళ్లిని నిరాకరించారన్న మనస్తాపంతో సందవేణి మహేష్(19)అనే యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.