యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST
యువకుడి ఆత్మహత్య

మల్హర్, డిసెంబరు 15 : తల్లి మందలించడంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మల్లారంలో మంగళవారం చోటుచేసుకుంది. కొయ్యూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాట్లపల్లి నరేశ్ (24) తండ్రి అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో నరేష్ తల్లి, తమ్ముడితో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోమని మూడేళ్ల నుంచి తల్లి చెబుతూ వస్తోంది. ఆమె మాటను నరేశ్ దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి మందలించడంతో మనస్తాపం చెంది అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.