పెళ్లి ఊరేగింపులో వాగ్వాదం.. యువకుడి హత్య

ABN , First Publish Date - 2020-12-11T13:08:40+05:30 IST

జిల్లాలోని మేడిపల్లి మండలం బీమారంలో పూదరి లక్ష్మణ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

పెళ్లి ఊరేగింపులో వాగ్వాదం.. యువకుడి హత్య

జగిత్యాల: జిల్లాలోని మేడిపల్లి మండలం బీమారం  గ్రామంలో పూదరి లక్ష్మణ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.  పెళ్లి ఊరేగింపులో లక్ష్మణ్‌తో పాటు ముగ్గురు యువకులు ఉన్నారు. లక్ష్మణ్‌తో వారికి వాగ్వాదం జరిగింది. యువకులు అతన్ని కత్తితో పొడిచి చంపేశారు.  సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, ఎస్సై సుధీర్‌రావు పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T13:08:40+05:30 IST