ఫ్రెండ్ ఇంటికెళ్తున్నాని చెప్పి యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2020-12-30T12:23:38+05:30 IST
ఫ్రెండ్ ఇంటికెళ్తున్నాని చెప్పి యువతి అదృశ్యం

హైదరాబాద్ : స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియాంక (18) దివ్యానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఈ నెల 28న స్నేహితురాలి ఇంటికి వెళ్లివస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు మంగళవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.