రాష్ట్ర డిస్కంలకే యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌

ABN , First Publish Date - 2020-03-13T09:11:18+05:30 IST

ల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్‌ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి.

రాష్ట్ర డిస్కంలకే యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్‌ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర డిస్కమ్‌లతో జెన్‌కో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్‌ సౌధలో జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సమక్షంలో జరిగిన సమావేశంలో జెన్‌కో అధికారులు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు పత్రాలపై సంతకాలు చేశారు.

Updated Date - 2020-03-13T09:11:18+05:30 IST