యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-09-20T15:18:21+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. హైకోర్టు రిజిస్ట్రార్,ఆలయ ఈవో...స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షణంలో పాల్గొన్నారు.