యాదాద్రి ప్రాకార మండపాలపై నవ నారసింహ దివ్య రూపాలు

ABN , First Publish Date - 2020-05-24T07:56:27+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అనేక విశేషాల సమాహారంగా, దేశంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ...

యాదాద్రి ప్రాకార మండపాలపై నవ నారసింహ దివ్య రూపాలు

యాదాద్రి, మే 23 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అనేక విశేషాల సమాహారంగా, దేశంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగానే అపురూప శిల్ప సౌరభాలు, పురాణ, ఇతిహాస, ధార్మిక ఘట్టాలను ఆలయ ప్రాకార మండపాలపై పొందుపరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నారసింహ క్షేత్రాల దివ్యరూపాలు సైతం ప్రధానాలయ మండపాలపై ఆవిష్కృతం కానున్నాయి. యాదాద్రి ప్రధానాలయ ప్రాకార మండపంలో తెలుగు రాష్ట్రాల్లో కొలువైన నవ నారసింహులతోపాటు తెలంగాణలోని ప్రముఖ నారసింహ ఆలయాల రూపాలను అంతర్‌ప్రాకార మండపంపై పొందుపరచనున్నారు. ఈ మేరకు నవ నారసింహ ఆలయాలు, అందులో వెలసిన నారసింహుల రూపాలను ప్రధానాలయ అంతర్‌ ప్రాకార మండప రాతిస్తంభాలపై ఆదివారం నుంచి చెక్కడం పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2020-05-24T07:56:27+05:30 IST