యాదాద్రిలో కొండకింద కల్యాణకట్ట తొలగింపు

ABN , First Publish Date - 2020-06-21T09:19:11+05:30 IST

యాదాద్రిలో కొండకింద కల్యాణకట్ట తొలగింపు

యాదాద్రిలో కొండకింద కల్యాణకట్ట తొలగింపు

యాదాద్రి టౌన్‌, జూన్‌ 20: భక్తుల తలనీలాలు తీసే సమయంలో కరోనా సోకకుండా తీసుకునే జాగ్రత్తలను నాయీబ్రాహ్మణులు పాటించడం లేదంటూ ఫిర్యాదులు అందడంతో యాదాద్రి కొండ కింద కల్యాణకట్టను పోలీసులు తొలగించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొండపైన తలనీలాలు తీసే కల్యాణకట్టను మూసివేయడంతో కొండకింద కల్యాణకట్టను ఏర్పాటుచేసుకున్న నాయీబ్రాహ్మణులు.. అక్కడే భక్తుల తలనీలాలు తీస్తున్నారు. కాగా, కల్యాణకట్ట తొలగింపుతో భక్తులు సెలూన్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై ఈవో గీతారెడ్డిని వివరణ కోరగా.. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులిస్తేనే కొండపైన కల్యాణకట్టకు అనుమతినిస్తామని తెలిపారు.

Updated Date - 2020-06-21T09:19:11+05:30 IST